ఆలయ స్వర్ణజయంతి
వైభవంగా వాసవీ కన్యకా పరమేశ్వరి
జయపురం: స్థానిక మహారాణిపేటలో వేంచేసి ఉన్న శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ స్వర్ణ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. జయపురం కళింగ వైశ్య సంఘం అద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రతిష్టించి నేటికి 50 ఏళ్లు నిండి స్వర్ణ జయంతి వేడుకలు జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ఉదయం మంగళ ధ్వనులతో వేద మంత్రోచ్ఛరణలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉమారామలింగేశ్వర, శ్రీసత్యనారాయణ స్వామి పున ః ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధర్మపురి నరేష్ శర్మ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాజాం సమీప బొద్దూరు వాస్తవ్యులు శ్రీవిద్యోపాసకులు బ్రహ్మశ్రీ రంప కోదండ శర్మ ఆధ్వర్యంలో చంద్రశేఖర శర్మ, ధర్మపురి హరిహర కుమార శర్మ, బంకుపల్లి సింహాచల శర్మ, నేతేటి శ్రీనివాస శర్మ(విశాఖ) బంకుపల్లి మార్కండేయ శర్మ, రేకేటి పవన్ కుమార్ శర్మ, ఆరవెల్లి శరత్ కుమార్ శర్మ, మహాముడి సుధీర్ శర్మ, బంకుపల్లి సత్యనారాయణ శర్మ, రంప జగదీష్ శర్మ, రంప రామలింగేశ్వర శర్మ, జోశ్యుల వేంకట రమణ మూర్తి శర్మ క్రతువులు నిర్వహించారు. 21 వ తేదీ వరకు శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి స్వర్ణ జయంతి జరుగుతాయని కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు వారణాశి సత్యనారాయణ తెలిపారు.
ఆలయ స్వర్ణజయంతి
ఆలయ స్వర్ణజయంతి


