ఇద్దరు శిశువులకు దత్తత
పర్లాకిమిడి: ఉత్తర్‌ప్రదేశ్ దంపతులకు బుధవారం జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ తన చాంబర్‌లో దత్తత నిమిత్తం 10 ఏళ్ల బాలిక, 13 ఏళ్ల బాలుడిని అప్పగించారు. కొన్నేళ్ల క్రితం అనాధలైన ఈ బాలబాలికలను జిల్లా యంత్రాంగం చేరదీసి జిల్లా శిశు సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు హాత్తిబడిలో ఉన్న ఉత్కళ బాలాశ్రమంలో చేర్చారు. వీరిని దత్తత తీసుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులు దరఖాస్తు చేసుకున్న మీదట కేంద్ర పోర్టల్‌లో అనుమతి లభించిన తరువాత ఆ ఇద్దరినీ కలెక్టర్ వారికి అప్పగించారు. ఇద్దరు బాలబాలికలతో ఇప్పటివరకు గజపతి జిల్లా పౌష్యసంతాన కేంద్రం నుంచి 80 మందిని అందజేయటం జరిగిందని జిల్లా శిశు సురక్షా సమతి చైర్మన్ అశివనీ మహాపాత్రో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి.యు అరుణ్ కుమార్ త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


