మహేంద్రతనయ నది వంతెన పరిశీలన
పర్లాకిమిడి: మహేంద్రతనయ నది వద్ద పాత పట్నం–పర్లాకిమిడిని కలుపుతున్న వంతెన నిర్మించి ఎనిమిదేళ్లు గడవక ముందే స్లాబ్‌పై రాడ్లు బయటకు రావడంతో ప్రమాద సంకేతంగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం సాయంత్రం రోడ్లు–భవనాల శాఖ ఎస్‌ఈ అభి షేక్ శెఠితో కలిసి పరిశీలించారు. దీనిపై ఎస్‌ఈ ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వంతెన మరమ్మతులకు నిధులు విడుదలయ్యాయని, టెండర్లు పిలువగా ఒక్క గుత్తేదారు టెండర్ వేశారన్నా రు. తిరిగి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వివరణ ఇచ్చారు. పురపాలక సంఘం చైర్‌పర్సన్ నిర్మలాశెఠి ఉన్నారు.
జయపురం: కొట్‌పాడ్ సమితి గులిమి జలపాతంలో గల్లంతైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నగరనార పోలీసుస్టేషన్ ఎ.ఎస్.ఐ అక్షయ చౌధురి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. అక్షయచౌధురి పిక్నిక్ స్పాట్‌కు వచ్చి జలపాతాన్ని తిలకిస్తుండగా ఒక్కసారిగా కాలుజారి జలపాతంలో పడిపోయాడు. వెంటనే కొట్‌పాడ్ పోలీసులు, వా డ్రాప్ గ్రూపు సభ్యులు రెండు రోజులుగా గాలి ంపు చేపట్టారు. ఎట్టకేలకు జలాశయంలో అతిలోతైన ప్రాంతంలో అక్షయ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
రాయగడ: శెశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పితామహాల్ కొండపై ఉన్న ఝడేశ్వర్ మందిరంలో బుధవారం సాయంత్రం చోరీ జరిగింది. మందిరం ప్రాంగణంలో గల హుండీని గుర్తుతెలియని దుండగులు విరగ్గొట్టి నగదును చోరీ చేసినట్లు మందిరం నిర్వాహకులు తెలియజేశారు. దీనికి సంబంధించి గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల శివరాత్రి ఉత్సవాలు జరగడంతో హుండీలో నగదు ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. మందిరం ప్రాంగణంలో గల గ్రిల్స్‌ను దుండగులు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
ప్రారంభమైన డోలోత్సవ పూజలు
కవిటి: మండలంలోని బెజ్జిపుట్టుగలో వెలసిన చక్రధర పెరుమాళ్ స్వామి ఆలయంలో బుధవారం డోలోత్సవ వేడుకలకు సంబంధించి తొలిరోజు పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే శ్రీదేవీ, భూదేవీ ససమేత చక్రధర పెరుమాళ్ స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజు పొందల శ్రీరాంబాబు దంపతుల సౌజన్యంతో స్వామివారికి అభిషేకం, అర్చన సేవలను నిర్వహించారు. సాయంత్రం మంధా నాగమణి భాగవతారిణిచే హరికథా గానం చేపట్టారు.
మహేంద్రతనయ నది వంతెన పరిశీలన
మహేంద్రతనయ నది వంతెన పరిశీలన
మహేంద్రతనయ నది వంతెన పరిశీలన


