సుభద్ర శక్తి మేళా ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సుభద్ర శక్తి మేళా ప్రారంభం

Feb 19 2026 9:29 AM | Updated on Feb 19 2026 9:29 AM

సుభద్

సుభద్ర శక్తి మేళా ప్రారంభం

సుభద్ర శక్తి మేళా ప్రారంభం

పర్లాకిమిడి : మహిళల ఆర్థిక పరిస్థితి ‘సుభద్ర’ పథకం వల్లే మెరుగుపడుతోందని ఎమ్మెల్యే రూపేష్‌పాణిగ్రాహి అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో సుభద్ర శక్తిమేళా–2026ను ఆయన ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షులు గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మల, కాశీనగర్‌ ఎన్‌ఏసీ చైర్మన్‌ మేడిబోయిన సుధారాణి, ఒడిశా మిషన్‌ శక్తి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ టిమోన్‌ బోరా, జిల్లా పరిషత్‌ అదనపు సి.డి.ఒ.పృథ్వీరాజ్‌ మండళ్‌, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు సుభధ్ర పథకం వల్ల స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నార ని చెప్పారు. మండల్‌ మాట్లాడుతూ జిల్లాలో పదివేల మంది మహిళలకు సుభద్ర పథకం వర్తింపజేశామన్నారు. హస్తకళలు, కొమ్ము సామాన్లు, పచ్చళ్ళు, పైనాపిల్‌ రసాలు అమ్మకం, గ్రానైట్‌, జీడి పప్పు ప్యాకేజీ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సుభద్ర శక్తి మేళా ప్రారంభం 1
1/2

సుభద్ర శక్తి మేళా ప్రారంభం

సుభద్ర శక్తి మేళా ప్రారంభం 2
2/2

సుభద్ర శక్తి మేళా ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement