చిరస్మరణీయుడు వెంకట కృష్ణారావు
భువనేశ్వర్: మాతృ భాష పరిరక్షణకు విశేషమైన కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు చిరస్మరణీయుడని వక్తలు అన్నారు. పశ్చిమ బెంగాల్ టిటాఘర్ జ్యోతిర్మయ యువజన విద్యా కేంద్రం మరియు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (రాతెస) సంయుక్త ఆధ్వర్యంలో దివంగత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. ఈ సభకు తెలుగు వర్సిటీ ఉప కులపతి ఆచార్య మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా, పూర్వ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి.ఎన్.రమేష్ విశేష అతిథిగా పాల్గొన్నారు. మాతృభాష గౌరవ ప్రతిష్టల కోసం మండలి వెంకట కృష్ణారావు కృషి సదా చిరస్మరణీయమని కొనియాడారు.


