అభివృద్ధి పనుల పరిశీలన
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితిలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి శనివారం పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. దీనిలో భాగంగా టాగురకోటా కొండపై శివుడి విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయనతో పాటు అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.
బీజేపీలోకి చేరికలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ, బిసంకటక్ సమితుల్లోని సమితి సభ్యులు, సర్పంచ్‌లు, మరికొంతమంది యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సమక్షంలో రాజధాని భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఒక సమావేశంలో వారంతా బీజేపీ కండువ కప్పుకున్నారు. మన్మోహన్ సామల్ వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామ సాధికారతే వికసిత్ భారత్ లక్ష్యం
మల్కన్‌గిరి: గ్రామాల సాధికారతే వికసిత్ భారత్ లక్ష్యమని ఎంపీ బలభద్ర మాఝి అన్నారు. జిల్లాలోని మత్తిలి సమితి చెడేంగా పంచాయతీలో వికసిత్ భారత్ గ్రామ అవగాహన సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యమే లక్ష్యంగా వికసిత్ భారత్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డొంబురు సీసా తదితరులు పాల్గొన్నారు.
రైల్వేలైన్ పరిశీలన
రాయగడ: విజయనగరం నుంచి టిట్లాఘడ్ వరకు నిర్మితమవుతున్న మూడోలైన్ పనుల్లో భాగంగా స్థానిక లడ్డ రైల్వేస్టేషన్ నుంచి జిమిడిపేట వరకు పూర్తయిన పనులను రైల్వే సేఫ్టీ కమిషనర్ బ్రజేష్ కుమార్ మిశ్రా పరిశీలించారు. శనివారం ఆయన పర్యటించి మూడో రైల్వేలైన్ పనులను సమీక్షించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా సేఫ్టీ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన పర్యటన సందర్భంగా రాయగడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధుల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దొంగతనం కేసులో
నిందితుడి అరెస్టు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల పోలీసులు దొంగతనం కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.లక్ష నగదు, 71 గ్రాముల బంగారు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, కోర్టుకు తరలించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అభివృద్ధి పనుల పరిశీలన
అభివృద్ధి పనుల పరిశీలన


