గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ నిలపాలి
రాయగడ: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పరిధి కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌లో గుంటూరు – రాయగడ ఎక్సప్రెస్‌ను నిలపాలని కోరుతూ శనివారం సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు (పార్వతీపురం) కొల్లి సాంబమూర్తి విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత బొరాకు వినతిపత్రం సమర్పించారు. రాయగడలోని జిమిడిపేట, లడ్డ మూడోలైన్‌లోని రన్నింగ్ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన ఆయనను లడ్డ రైల్వేస్టేషన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. నాలుగేళ్ల క్రితం కరోనా సమయంలో కూనేరు రైల్వేస్టేషన్ వద్ద గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేయడం విరమించుకున్నారన్నారు. అంతకుముందు ఈ ట్రైన్‌ను ఆపేవారని, దీంతో సుమారు 50 గ్రామాలకు చెందిన ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో నిలపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఆర్‌ఎం తిరిగి ఆ సౌకర్యాన్ని మెరుగుపరిచేవిధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


