న్యాయవాదుల సంఘం భవనం ప్రారంభం
–8లోu
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయవాదుల సంఘం జయపురం నూతన కార్యాలయ భవనంతో పాటు జిల్లా కోర్టు ట్రాన్సిట్ గృహాలను ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టండర్ నూతన భవనాలను ప్రారంభించారు. గౌరవ అతిథిగా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ చిత్తరంజన్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ టండర్ మాట్లాడుతూ.. ఒడియా భాష అంటే తనక మక్కువ అని, తాను ఒడియాలో మాట్లాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరితో కలిసి నూతన భవణాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘానికి నూతన కార్యాలయం మరియు ట్రాన్సిట్ గృహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చామని, ఎట్టకేలకు తమ డిమాండ్ నెరవేరిందని జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు సరోజ్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వర్‌ను సందర్శించారు.


