వ్యాసరచన పోటీలకు విశేష స్పందన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సుస్థిర అభివృద్ధి, లక్ష్యాలు, ప్రచారం, విస్తరణ లక్ష్యంతో జిల్లా ప్రణాళిక, పరిశీలన కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక బుటిగూడ నోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వ్యాసరచన, చిత్రలేఖనం, డిబేట్, క్వీజ్ పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోట్టీల్లో జూనియర్ గ్రూప్‌లో 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు, సీనియర్ గ్రూప్‌లో +2, +3 విద్యర్థులు పాల్గొన్నారు. చిత్రలేఖనంలో జూనియర్ గ్రూప్‌లో మొదటి స్థానంలో అర్జున్ హంతాళ్, రెండో స్థానంలో కృష్ణశీశా, మూడో స్థానంలో అశిష్ కుమార్ సాబత్, సినియర్ గ్రూప్‌లో మొదటి స్థానంలో రుద్రప్రసాద్ గౌడ, రెండో స్థానంలో కుమారి విదిశా మహంతి, మూడో స్థానంలో ఓం మహంతి, తేజస్విని మిశ్రా నిలిచారు. ప్రోత్సాహక బహుమతులను శివ మటామ్ అందజేశారు. క్వీజ్ పోటీలో జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో దివాకర్ మండల్, రెండోస్థానలో కుముద్, పి.అజ్మేరా, మూడో స్థానంలో రష్మితా పడిఆరి, సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో పరాయణీ హంసదా, రెండో స్థానంలో శుభశ్రీ ఇసాలబత్, మూడో స్థానంలో మణిరామ్ ధారువా నిలిచారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహుకులు తెలిపారు.
వ్యాసరచన పోటీలకు విశేష స్పందన
వ్యాసరచన పోటీలకు విశేష స్పందన


