యువకుడిపై దాడి
రాయగడ: ఇద్దరు అన్నదమ్ముల తగాదాలో మధ్యలో తలదూర్చిని వ్యక్తిపై మారణాయుధంతో దాడి చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. చందిలి పోలీస్ స్టేషన్ పరిధి మల్లిగాంలో జరిగిన ఈ ఘటనలో జిల్లాలోని కొలనార సమితి గువాకొన గ్రామానికి చెందిన సంతోష్ కుండ్రుక గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గువాకొన గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు మల్లిగాంలో ఒక పొలంలో ధాన్యం కోతల్లొ కూలిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పొలం యజమానులైన ఇద్దరు అన్నదమ్ములు ఏదో విషయమై ధాన్యం కొస్తున్న పొలంలొ గొడవపడ్డారు. ఇద్దరి గొడవ చినికిచినికి గాలివానలా మరడంతో ఇద్దరిని నచ్చజెప్పేందుకు సందోష్ మధ్యలో దూరాడు. తమ గొడవ మధ్యలో ఎందుకు వచ్చావంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరూ సంతోష్‌పై మరణాయుధంతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలకు గురై పడిపోయిన సంతోష్‌ను అక్కడి వారు స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.


