నిధులు మంజూరు
మహిళా కళాశాలకు ..
పర్లాకిమిడి: మహిళా ప్లస్ టు కళాశాల రెండేళ్లుగా అనేక మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అనేక వినతులు సమర్పించిన దృష్ట్యా వారికి ఎమ్మెల్యే ల్యాడ్ నిధుల నుంచి రూ. 3లక్షలు మంజూరు చేస్తున్నామని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గురువారం సాయంత్రం స్థానిక మహిళా ఉన్నత మాధ్యమిక విద్యాలయం 40 వ వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి మాట్లాడారు. ఈ మహిళా ప్లస్‌టు కళాశాలలో చదివి ఎంతో మంది ఉన్నత పదవులు అలంకరించారని, తాను కూడా ఈ కళాశాల ఉన్నతికి ఆకాంక్షిస్తున్నానని పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి అన్నారు. మహిళా మాధ్యమిక విద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ మహేంద్ర రయితో వార్షిక పట్టికను చదివి వినిపించారు. అనంతరం జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఎమ్మెల్యే రూపేష్ చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు క్యాష్ అవార్డులను అందజేశారు. ఈ బహుమతి ప్రదాన ఉత్సవంలో పర్లాకిమిడి పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్లస్‌టు కళాశాల విద్యార్థినులు ఒడిషా సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు. ప్లస్‌టు కళాశాల ఉపాధ్యక్షులు సంయుక్తా పాత్రో, సాంస్కృతిక పరిషద్ ఉపాధ్యక్షులు స్వగతికి పండా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
నిధులు మంజూరు
నిధులు మంజూరు
నిధులు మంజూరు


