గండాహతిలో రెడ్‌క్రాస్ రక్తదానం
పర్లాకిమిడి: జిల్లాలోని రాయగడ బ్లాక్ గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి జూనియర్ రెడ్ క్రాస్ విద్య, శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో విచ్చేసి రెడ్ క్రాస్ విద్యార్థుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గండాహతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రెడ్ క్రాస్ విద్యార్థులు 33 యూనిట్ల రక్తాన్ని దాతలు స్వచ్ఛందంగా అందజేశారు. రెడ్ క్రాస్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు మోహన ఎమ్మెల్యే గోమాంగో అభినందనలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమానికి అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, అధ్యక్షత వహించగా, మరో అతిథి మనోజ్ కుమార్ బెహారా, సిద్ధార్థ శంకర పాఠి, గౌరవ అతిధిగా విద్యాలయం కమిటీ అధ్యక్షులు అశోక్ దోళాయి పాల్గొన్నారు. చివరి రోజున 170 మంది రెడ్‌క్రాస్ పరామర్శ దాతలు పాల్గొన్నారు. జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు ఈ శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించారు.


