బాల్య వివాహాల కట్టడికి చర్యలు
రాయగడ: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖెముండొ వంద రోజుల చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. బాల్య వివాహ ముక్త భారత్ అభిజాన్ కార్యక్రమంలో భాగంగా ఈ చైతన్య కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక, సంక్షేమ శాఖ అధికారి మీనతి దేవ్, డీపీహెచ్‌వో డాక్టర్ రుమా మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల కట్టడికి చర్యలు


