బీఆర్‌ఏయూలో సౌకర్యాలపై ఆరా
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి బుధవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా భవనం పరిశీలించి భవనం రాజమందిరాన్ని తలపిస్తోందంటూ ప్రశంసించారు. వర్శిటీలోని ఖాళీ ప్రదేశంలో హంపీ థియేటర్ నిర్మిస్తే క్యాంపస్ మరింత శోభాయమానంగా ఉంటుందని సూచించారు. ఔషధ మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, మాజీ రిజిస్ట్రార్ పి.సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వప్నవాహిని, ఎస్‌ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఎన్ సంతోష్‌రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.


