ముప్పు తప్పదు!
బిడియం వద్దు..
వ్యక్తిగత శుభ్రత పాటించాలి...
మేలుకోకుంటే..
● మహిళలూ.. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ● ప్రాణాంతక వ్యాధులపై అప్రమత్త అవసరం ● 30 ఏళ్లు దాటితే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
టెక్కలి: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు. ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరు. ఈ క్రమంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. పూర్తి స్థాయిలో నిద్రపోకపోవడం.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదాలు ఉన్నాయంటూ ప్రసూతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రసూతి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
కచ్చితంగా చేసుకోవాల్సిందే.
● మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి.
● 9 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు వైద్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్లు వేయించాలి. హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి.
● సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు సరిపడా నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వారి పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాకాకుండా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగరూకతతో మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు.
మహిళల్లో ప్రధానంగా థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌తో పాటు ఇటీవల పీసీఓఎస్ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను గోప్యతగా ఉంచడం మంచిది కాదు. 65 ఏళ్లు దాటిన మహిళల్లో సైతం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి బిడియం లేకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.
– డాక్టర్ వి.జి.ప్రసూన, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి
మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్నో రకాల వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఆహారపు అలవాట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంట్లో పనుల హడావుడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న పాటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా మారుతాయి.
– డాక్టర్ కె.ధనలక్ష్మి, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి
ముప్పు తప్పదు!
ముప్పు తప్పదు!


