సిల్క్ సిటీని గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దుతాం
● ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి
● బరంపురంలో సరస్వతీ
శిశు విద్యామందిర్ 42వ
వార్షికోత్సవంలో వెల్లడి
పర్లాకిమిడి:
సిల్క్ సిటీగా ఉన్న బరంపురం పట్టణాన్ని గ్రేటర్ సిటీగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి మోహాన్ చరణ్‌మఝి బుధవారం అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా బరంపురంలోని నీలకంఠపురంలో ఉన్న సరస్వతి శిశు విద్యామందిర్ 42వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సరస్వతి శిశుమందిర్‌లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్నత ఉద్యోగాలు, పదవుల్లో ఉన్నారన్నారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామని, అందుకు గోదబరీష మిశ్రా ఆదర్శ ప్రాథమిక పాఠశాల పథకం, శిశు బాటిక పథకాలను నూతన విద్యావిధానం 2020 లో జోడిస్తామన్నారు. ఒకప్పుడు సరస్వతి శిశు విద్యా మందిర్‌లో ఉపాధ్యాయునిగా పనిచేసిన జ్ఞాపకాలు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుతెస్తున్నాయన్నారు. ఈ వార్షికోత్సవంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బిభూతి జెన్నా, బరంపురం ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్, చికిటి ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో, పూర్ణచంద్ర శెఠి, సరోజ్ పాడీలు మాట్లాడారు. ఈ సంద్భరంగా సరస్వతి శిశు మందిర్ మెరిట్ విద్యార్థులను ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి, రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా బహుమతులు అందజేసి సత్కరించారు. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝిని సరస్వతి శిశు విద్యామందిర్ విద్యా కమిటీ ఘనంగా సన్మానించారు.
బరంపురం పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం..
ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి విలేకరులతో మాట్లాడారు. బరంపురం సిటీని అత్యున్నత టెక్నాలజీతో పట్టణంలో కీలకమైన పదిలైన్ల రోడ్లను నిర్మిస్తామన్నారు. దీనికి జిల్లా రోడ్లు, భవనాలశాఖ డి.పి.ఆర్‌లను తయారుచేసి గ్రేటర్ బరంపురం సిటీగా తీర్చిదిద్దడానికి అంచానాలు పంపాలని ఆదేశించారు. దక్షిణ ఒడిశాలో గంజాం జిల్లా ఒక కీలక భూమిక పోషిస్తుందని, అందువల్ల వ్యాపారం, రవాణా కోసం సుమారు రూ. 52.17 కోట్లతో 10 లైన్ల రోడ్లను బరంపురం నుంచి జయపురం వరకు పొడిగించడం జరుగుతుందన్నారు. బరంపురం సిటీలో టౌన్ ప్లానింగ్ పథకాలు అమలుచేస్తామని, మోడ్రన్ టెక్నాలజీ అనుసరిస్తామని.. దీనివల్ల సిటీలో అవుట్ స్కర్ట్స్‌లో నివసిస్తున్న భూయజమానులకు కూడా ఉపయోగం కలుగుతుందని ముఖ్యమంత్రి మోహాన్ మఝి అన్నారు.
సిల్క్ సిటీని గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దుతాం
సిల్క్ సిటీని గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దుతాం
సిల్క్ సిటీని గ్రేటర్ సిటీగా తీర్చిదిద్దుతాం


