గుడారిలో చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని గుడారిలో చొయితీ ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. సమితి అధ్యక్షురాలు లక్ష్మీ సబర్, బీడీవో సుచిస్మిత బెహర, తహసీల్దార్ ఎ.స్నేహలత, గుడారి పోలీస్ స్టేషన్ ఐఐసీ సమర్పిత స్వయి, ఎన్‌ఏసీ కార్యనిర్వాహక అధికారి ప్రశన్నకుమార్ పాఢి, వైస్ చైర్మన్ విశ్వనాథ్ సబర్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు సమీపంలోని వంశధాన నది నుంచి శుద్ధ జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చొయితీ ఉత్సవ వేదికపై ఉంచారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మన ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అందరి కర్తవ్యమని అన్నారు. భిన్న సంస్కృతులు ఉన్న మన రాష్ట్రంలో కళాకారులను ప్రోత్సాహించడం అందరి బాధ్యతనన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు సన్మానించారు.
గుడారిలో చొయితీ ఉత్సవాలు


