మత్తుతో జీవితం చిత్తు
రాయగడ: మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితం నాశనమవుతోందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి అన్నారు. రాయగడలోని వివేకానంద విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసగా మారితే బంగారు భవిష్యత్ బుగ్గిపాలవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశా విముక్తి అభిజాన్ వంటి పథకాలతో ప్రజలను చైతన్యం చేస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలు సైతం పోరాటం సాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిజయ్ చౌదరి, రాయగడ అటా నమస్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి.జ్యోతి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ కో ఆర్డినేటర్ సరస్వతి నంది తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వదిలి వేతనాలు పెంచుకుంటారా?
జయపురం: ప్రజా సమస్యలు పరిష్కరించడం వదిలేసి విధానసభ సభ్యులు తమ వేతనాలు మూడింతలు పెంచుకోవడాన్ని ప్రజా ఉద్యమకారుడు బి.హరిరావు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయమై సీఎం మోహన్‌చరణ్ మాఝీ పునరాలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుతూ శనివారం జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు, నిరుపేదలు, నిస్సహాయులు పింఛన్లకు నోచుకోక దుర్భర జీవితం గడుపుతున్నారని, అటువంటి వారికి ఆర్థిక సహాయం అందించకుండా ఎమ్మెల్యేలకు జీతాలు మూడింతలు పెంచటం ఆమోద్య యోగ్యం కాదన్నారు.
ఇస్రో సందర్శనకు
సాయిశ్రీ పండిట్ ఎంపిక
పర్లాకిమిడి: స్థానిక సరస్వతి శిశు విద్యామందిర్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని సాయిశ్రీ పండిట్ ఇస్రో ట్రిప్‌కు ఎంపికై ంది. ఆమె తయారుచేసిన భవిష్యత్తు గగణయాన్ మిషన్‌పై తయారుచేసిన నమూనా రాష్ట్రంలో 60 మంది విద్యార్థుల్లో ఎంపికై ఇస్రో సందర్శన ఆవార్డును గెలుచుకున్నది. శనివారం భువనేశ్వర్‌లో పఠానిసామంతరే ప్లానిటోరియంలో జరిగిన సభలో.. రాష్ట్ర ఆహార సరఫరా, సైన్సు శాఖ మంత్రి జయనారాయణ పాత్రో చేతులమీదుగా సాయిశ్రీకి బహుమతి అందజేశారు. యంగ్ ఆస్ట్రోనమర్ టాలెంటు సెర్చ్(యాట్స్) పోటీని టాటా స్టీల్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. సాయిశ్రీ పండిట్ తండ్రి గురుజీ గోపాల కృష్ణ పండిట్, సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్‌పండా, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా సాయిశ్రీ పండిట్‌కు అభినందనలు తెలిపారు.
మత్తుతో జీవితం చిత్తు
మత్తుతో జీవితం చిత్తు


