అదిరిందోయ్!
మండయ్..
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 వైభవంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రం సమీపంలో బెహరాగుడ మార్గంలో మోడల్ స్కూల్ వద్ద మండయ్ మైదానంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈ నెల 17 వరకు కొనసాగనున్నాయి. స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కళాకారులు తరలివచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులోని మా బండారు ఘరణి శక్తి పీఠంలో కలెక్టర్ మహేశ్వర్ ప్రారంభోత్సవ పూజలు చేశారు. అనంతరం గిరిజన సంప్రదాయ కళాకారులతో భారీ ర్యాలీ చేపట్టారు. మైదానంలో 400కు పైగా వాణిజ్య స్టాల్స్ ఏర్పాటు చేశారు. తొలి రోజు మహారాష్ట్రకు చెందిన లవణి, ఒడిశా రాష్ట్ర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. జిల్లాకు చెందిన గిరిజన సాంస్కృతిక మంత్రి నిత్యానంద గొండో వేదికపై మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ మున్నాఖాన్, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, మనోహర్ రంధారీ, నర్సింగ్ బోత్రా తదితరులు పాల్గొన్నారు.
అదిరిందోయ్!
అదిరిందోయ్!
అదిరిందోయ్!


