లోక్ అదాలత్‌లో 2,753 కేసులు పరిష్కారం
పర్లాకిమిడి: జాతీయ న్యాయ సేవా ప్రాధికరణ (న్యూ ఢిల్లీ) ఆదేశాల మేరకు జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు జగదీష్ ప్రసాద్ మహాంతి శనివారం నాలుగో లోక్ అదాలత్‌ను పర్లాకిమిడి జిల్లా కోర్టు, మోహానా, ఆర్.ఉదయగిరి, గ్రామన్యాయలయం, కాశీనగర్‌లలో నిర్వహించారు. లోక్ ఆదాలత్‌లో మొత్తం 3,542 కేసులకు 2,753 వివిధ కేసులు పరిష్కరించారు. 25,20,679 రూపాయల రెవెన్యూ వివిధ జరిమానాలు, ఒన్‌టైం సెటిల్‌మెంట్ అయినట్టు కోర్టు అధికారులు తెలియజేశారు. లోక్ అదాలత్‌లో ఆదనపు జిల్లా జడ్జి బిభుప్రసాద్ పండా, నరోత్తమ శెఠి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జీబనానంద పాఢి, డి.ఎల్.ఎస్.ఎ కార్యదర్శి బిమల్ రవుళో, మహిళా కోర్టు బిష్ణుప్రియా సామంతరాయ్, జ్యోతిపాణి (జేఎంఎఫ్‌సీ), బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్ర పట్నాయక్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం
రాయగడ: స్థానిక జిల్లా సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో వివిధ కేసులను పరిష్కరించారు. గుణుపూర్, బిసంకటక్, కాసీపూర్, పద్మపూర్, మునిగుడ కోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 191 కేసులను పరిష్కరించి జరిమానా కింద రూ.66, 01,843 వసూలు చేశారు. రెవెన్యూకు సంబంధించి 20,585, ప్రిలిటిగేషన్‌కు సంబంధించి 52 కేసులు పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ.14,36,058 వసూలు చేశారు. జిల్లా జడ్జి సత్యనారాయణ షొడంగి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి సంజిత్‌కుమార్ బెహరా, అదనపు జిల్లా జడ్జి అపర్ణ మహాపాత్రో, మహిళా కోర్టు న్యాయమూర్తి సుస్మిత మిశ్రొ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 2,753 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్‌లో 2,753 కేసులు పరిష్కారం


