● ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
● ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
జయపురం: జయపురంలోని తెలుగు సంస్కృతిక సమితి ఆధ్వర్యంలో స్థానిక సిటీ ఉన్నత పాఠశాలలో రెండు రోజులు నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. పాఠశాల మాజీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించి స్థానిక ఛౌడేశ్వరి దేవి మందిరంలో పూజలు చేసి క్రీడాజ్యోతిని వెలించారు. మందిరం నుంచి క్రీడా జ్యోతితో విద్యార్థులు ర్యాలీగా పాఠశాలకు చేరుకోగా.. పీఈటీ ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్ క్రీడా జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణతో విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా 100 మీటర్ల పరుగు, డిస్కస్‌త్రో, స్లోసైకిలింగ్, లెమన్ స్పూన్, లాంగ్ జంప్, హైజంప్, కబడ్డీ, త్రీ లెగ్‌డ్ రేస్ మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. క్రీడా పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరాజు, కె.రామకృష్ణ, ప్రతాప్ కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి జనవరి 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే ఉత్సవాల్లో బహుమతులు ప్రదానం చేస్తామని ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత వెల్లడించారు.
● ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
● ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
● ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు


