కొరాపుట్ రైల్వేమార్గంలో జీఎం పర్యటన
కొరాపుట్: కొరాపుట్–రాయగడ రైల్వే మార్గంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంఖ్‌వాల్ శనివారం పర్యటించారు. కొరాపుట్ రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ ప్రాజెక్ట్ ద్వారా చేపడుతున్న నిర్మాణాలను పరిశీలించారు. కక్కిరిగుమ్మ రైల్వే స్టేషన్ భవన నిర్మాణం పురోగతిపై సమీక్షించారు. లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్‌లో పనులపై ఆరా తీశారు. క్వార్టర్స్ భవనాల నిర్మాణం, సిగ్నల్ వ్యవస్ధ పరీక్షించారు. 354 నెంబర్ వంతెన వద్ద ఐదు డిగ్రీల మలుపు పరిశీలించారు. ఆయనతో పాటు వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోరా, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొరాపుట్ రైల్వేమార్గంలో జీఎం పర్యటన


