సూరీడి ఇంటి గుట్టు | - | Sakshi
Sakshi News home page

సూరీడి ఇంటి గుట్టు

Dec 12 2025 10:12 AM | Updated on Dec 12 2025 10:12 AM

సూరీడ

సూరీడి ఇంటి గుట్టు

● కోణార్క్‌ గర్భ గృహంలో ఏముందో..? ● 122 ఏళ్ల తర్వాత బృహత్తర ప్రయత్నం పూర్వాపరాలు

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
ఇసుక పొరల మాటున..
● కోణార్క్‌ గర్భ గృహంలో ఏముందో..? ● 122 ఏళ్ల తర్వాత బృహత్తర ప్రయత్నం
పూర్వాపరాలు
రాష్ట్ర స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ కప్‌ కై వసం

భువనేశ్వర్‌: కోణార్క్‌ సూర్యదేవాలయం గర్భగుడి రహస్యం వీడే సమయం దగ్గరపడుతోంది. గత 122 సంవత్సరాల నుంచి ఈ ఆలయ గర్భ గుడి నాట్య మండపం మూత బడి ఉంది. నల్ల పగోడాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యునెస్కో వారసత్వ కట్టడం గుర్తింపు పొందింది. అపురూపమైన శిల్ప కళకు కోణార్క్‌ సూర్య దేవాలయం ప్రతీతి. ఆబాలగోపాలానికి నిరంతరం ఆకట్టుకునే సూర్య దేవాలయం లోపల ఏం ఇమిడి ఉందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అతి త్వరలో ఈ ఉత్కంఠ తొలగే సంకేతాలు బలపడుతున్నాయి. గర్భగుడి లోపల ఇసుక నింపి మూసి వేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇసుకను తొలగించి లోపల ఉన్న కళాకృతులు వగైరా వివరాల ఆచూకీ తేల్చేందుకు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) రంగంలోకి దిగింది. 13వ శతాబ్దపు స్మారక చిహ్నం నిర్మాణ పరిరక్షణలో కోణార్క్‌ సూర్య దేవాలయం ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది.

122 ఏళ్ల తర్వాత

122 ఏళ్ల తర్వాత భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) దేవాలయం గర్భగుడిలో నింపిన ఇసుక నిక్షేపాన్ని తొలగించే సున్నితమైన ప్రక్రియను ప్రారంభించింది. దీర్ఘకాలంగా మూసి ఉన్న గది లోపల ఏమి ఉందో అనే ప్రపంచ వ్యాప్త ఉత్సుకతను రేకెత్తిస్తుంది. కోణార్క్‌ సూర్య దేవాలయం నిర్మాణం కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్‌ వారు 1903, 1909 మధ్య గర్భగుడిని ఇసుకతో నింపారు. గర్భగుడి పైకప్పునకు దన్నుగా నిలిపిన ఇనుప దూలాలు, రాళ్లు పేరిక సడలినట్లు గమనించడంతో బృహత్తర అపురూప కళాఖండం కుప్పకూలిపోకుండా దీర్ఘ కాల సంరక్షణ కోసం ఇసుకతో నింపినట్లు నిపుణులు ధ్రువీకరించారు. పైకప్పు కూలిపోకుండా ఉండటానికి వారు గర్భగుడి చుట్టూ 15 అడుగుల ఎత్తైన లోపలి రాతి ప్రాకారం నిర్మించి ఇసుక, రాతి ముక్కలతో నింపారు. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పూరీ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ డీబీ గొడొనాయక్‌, ప్రాంతీయ డైరెక్టర్‌ దిలీప్‌ ఖమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 మంది సభ్యుల నిపుణుల బృందం కోణార్క్‌ సూర్య దేవాలయం సమగ్ర నిర్మాణ శైలిని పరిశీలించి సమీక్షించింది. ఆలయం రాతి గోడల స్థితిని ముందస్తుగా పరిశీలించి గర్భగుడి మొదటి వేదిక యొక్క పశ్చిమ వైపున 4 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో చతురస్రాకారం సొరంగం తవ్వకానికి రంగంలోకి దిగింది. పెద్ద పరిమాణంలో ఇసుకను తొలగించే ముందు అంతర్గత స్థిరత్వాన్ని అంచనా వేయడానికి వీలుగా గర్భగుడి కుడి వైపున 9 మీటర్ల పొడవు, 16 సెంటీమీటర్ల వెడల్పుతో కోర్‌ డ్రిల్లింగ్‌ చేశారు. ఈ సన్నాహం ఫలప్రదమై ఇసుక పొరను తాకింది. ఈ దశలో గర్భగుడి గోడలు ఎనిమిది మీటర్ల మందంతో ఉన్నాయని ఏఎస్‌ఐ ఇంజనీర్లు ధ్రువీకరించారు. కొనసాగుతున్న వెలికితీత ప్రక్రియ ప్రాచీన ఆలయ నిర్మాణాత్మక శైలికి ఏమాత్రం ముప్పు లేకుండా చేపడుతున్నట్లు నిపుణుల వర్గం భరోసా ఇచ్చింది.

క్రమంగా ఆలయంలో నిండిన ఇసుక పొర తొలగించడం సాధ్యం అవుతుండగా నిపుణులు ఆలయం పైకప్పు రాళ్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాచీన ఆలయం దీర్ఘకాలిక భద్రత నిర్ధారణకు సుస్థిర ప్రణాళిక రూపకల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇసుక వెలికితీత ప్రయత్నం విజయవంతమైతే శతాబ్దానికి పైగా మూతబడిన గర్భగుడిలోకి పర్యాటకులు ప్రవేశించి గర్భ గుడిలో ఇసుక పొరల మధ్య దాగిన అపురూప శిల్పాలను వీక్షించే దీర్ఘకాల కల సాకారం అవుతుంది. 13వ శతాబ్దానికి చెందిన పూర్వపు కళింగ రాతి శిల్పాలు, సంక్లిష్టమైన వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్ని కలిగి ఉన్న కోణార్క్‌ సూర్య దేవాలయం భారీ నాట్య మండపం, జగమోహన్‌ను ప్రపంచ ప్రజలు వీక్షించగలుగుతారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క తదుపరి దశ పరిరక్షణ ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు. కోణార్క్‌ సూర్య దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ స్మారక చిహ్నం నుంచి ఇసుక తొలగింపు మా కలల ప్రాజెక్ట్‌. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏఎస్‌ఐ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మేము చాలా జాగ్రత్తగా ఆచి తూచి దీనిపై పని చేస్తున్నామని సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ డీబీ గొడొనాయక్‌ అన్నారు.

ఏఎస్‌ఐ సాహస కృత్యం

ప్రపంచ వారసత్వ కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భ గుడిలో నిక్షిప్తంగా ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు భారత పురావస్తు సర్వే ఏఎస్‌ఐ రంగంలోకి దిగడం సాహసోపేత చర్యగా యునెస్కో అభినందించింది. ఇదో ఆరోగ్యకరమైన సంకేతంగా యునెస్కో పేర్కొంది. గర్భగుడిలో నిండిన ఇసుక తొలగించడం వల్ల పురాతన ఆలయ ఇంజినీరింగ్‌ నైపుణ్యత వెల్లడవుతుందని యునెస్కో భావిస్తుంది.

ధాన్యం కుప్పలు దగ్ధం

నిర్మాణాత్మక నష్టాన్ని నివారించడానికి 1903 సంవత్సరంలో బ్రిటిష్‌ పాలకులు ఈ గర్భగుడిని ఇసుక, రాళ్లతో నింపిన 122 ఏళ్ల తర్వాత అంతర్గత స్థితిని అంచనా వేయడానికి రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) లేజర్‌ స్కానింగ్‌, ఎండోస్కోపిక్‌ అధ్యయనాలను నిర్వహించి సీలు చేసిన స్థలం లోపల రోబోటిక్‌ కెమెరాలను మోహరించింది. అలాగే 2011 సంవత్సరంలో పరిరక్షణ వ్యూహాలను చర్చించడానికి ఒక అంతర్జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీని తర్వాత ఒడిశా ఉన్నత న్యాయ స్థానం స్మారక చిహ్నం యొక్క పరిస్థితిని పరిశీలించడానికి అమికస్‌ క్యూరీని నియమించింది. 2020లో జరిగిన ఉన్నత స్థాయి భారత పురావస్తు సర్వే ఏఎస్‌ఐ సమావేశం చివరకు ఇసుక తొలగింపు ప్రక్రియను కొనసాగించాలనే నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం ప్రాథమిక డ్రిల్లింగ్‌ తర్వాత గర్భ గృహం లోపలి ఇసుక, రాతిని సేకరించారు. వాటి నమూనా పరీక్ష కోసం ఐఐటీ మద్రాస్‌, ఐఎంఎంటీ భువనేశ్వర్‌లకు పంపారు.

సూరీడి ఇంటి గుట్టు 1
1/3

సూరీడి ఇంటి గుట్టు

సూరీడి ఇంటి గుట్టు 2
2/3

సూరీడి ఇంటి గుట్టు

సూరీడి ఇంటి గుట్టు 3
3/3

సూరీడి ఇంటి గుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement