వణుకుతున్న కొరాపుట్
కొరాపుట్:
కొరాపుట్‌పై చలిపులి దాడి చేస్తోంది. గురువారం కొరాపుట్ జిల్లా దమంజోడి లోని భారత అల్యూమినియం కేంద్రం వద్ద 2.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌ని తలపిస్తూ కొన్ని చోట్ల మంచు కురుస్తుండడం విశేషం. సిమిలిగుడ పట్టణం సమీపంలోని డొంగుడ ప్రాంతంలో క్రిస్టియన్ శ్మశానం ప్రాంతంలో ఉదయం పొలాల్లో వస్త్రాలపై మంచు ముక్కలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తలుపులు తీయడానికే భయపడుతున్నారు. రాత్రి పూట ప్రయాణాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ జిల్లాలో జాతీయ రహదారులపై కూడా రాత్రి పూట వాహనాలు అలికిడి లేకుండా పోయింది. ఈ ప్రాంతం నుంచి సుదూరంగా వెళ్లే రాత్రి పూట అంతర్‌రాష్ట్ర బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి.
వణుకుతున్న కొరాపుట్
వణుకుతున్న కొరాపుట్


