రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం
● ఇద్దరు విద్యార్థుల మృతి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలో గల రామనగుడ సమితి పాలుపాయి మలుపు వద్ద గురువారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు జిల్లాలోని గుడారిలో గల సౌరా వీధికి చెందిన దేవేంద్ర సబర్ (21), ఢెప్పాగుడ వీధికి చెందిన విష్ణు సబర్ (21) లుగా గుర్తించారు. రామనగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. దేవేంద్ర, విష్ణులు రామనగుడ సమీపంలో గల బడిషాల ప్రాంతంలో గల ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నారు. గురువారం తమ స్వగ్రామమైన గుడారి నుంచి ఒక బైకుపై పాఠశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో రామనగుడ సమితిలోని పాలపాయి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సును అదుపు తప్పి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలంలో మృతి చెందారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం
రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం
రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం
రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం


