హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు | - | Sakshi
Sakshi News home page

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు

Oct 31 2025 7:28 AM | Updated on Oct 31 2025 7:28 AM

హెడ్‌

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు గర్భం దాల్చిన బాలిక మెళియాపుట్టి ఏఎస్‌ఐ హఠాన్మరణం శాసీ్త్రయంగా బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

శ్రీకాకుళం క్రైమ్‌ : ఈ ఏడాది జూన్‌లో టెక్కలి వద్ద రోడ్డు ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ పి. జగదీశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా మంజూరైంది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా ఆధ్వర్యంలో పోలీస్‌ శాలరీ ప్యాకేజీ కింద కల్పించిన వ్యక్తిగత బీమా పాలసీ జగదీశ్వరరా వు చేసినందునే ఇంత పెద్ద మొత్తంలో బీమా మంజూరైంది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెడ్‌కానిస్టేబుల్‌ కుటుంబాన్ని గురువారం పిలిపించి రూ.కోటి చెక్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు తమ ఖాతాలను పోలీస్‌ శాలరీ ప్యాకేజీకి అనుసంధానం చేసుకోవాలన్నారు. విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు మరణించే పోలీసులు తమ కుటుంబాలకు అందించే అత్యంత ఆర్థిక చేయూత ఈ బీమా అని ఎస్పీ పేర్కొన్నారు.

సంతబొమ్మాళి : చిన్నతుంగాం పంచాయతీ కృష్ణచంద్రాపురంలో ఓ బాలిక గర్భం దాల్చింది. టెక్కలి జిల్లాప్రభుత్వ ఆసుపత్రికి బాలిక చికిత్స నిమిత్తం రాగా విషయం గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో బాలిక, యువకుడు పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. యువకుడు కొన్ని నెలలుగా ప్రేమపేరుతో దగ్గరవ్వడంతో బాలిక గర్భాన్ని దాల్చింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గ్రామపెద్దల సమక్షంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. బాలిక గర్భం తొలగించేందుకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడంతో విషయం బహిర్గతమైంది. పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం చేరవేశారు.

మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న బగాది అప్పన్న(57) గురువా రం విధి నిర్వహణలో ఉంటూనే మృతి చెందారు. తోటిపోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యా హ్నం ఒడిశాకు చెందిన ఓ మంత్రి పర్యటనకు రావడంతో బోర్డర్‌లో విధులు నిర్వహించారు. డ్యూటీ ముగిసిన అనంతరం చాపరలో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నా రు. అప్పటికే కుటుంబసభ్యులు శ్రీకాకుళం షాపింగ్‌కు వెళ్లిపోవడంతో. అప్పన్న ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఇంతలో తోటి ఏఎస్సై రమణ.. అప్పన్నకు ఫోన్‌చేసి కుటుంబసభ్యులు ఎవరూలేరు కదా భోజనానికి వచ్చేస్తావా? అని అడిగారు. డాక్టర్‌ తీసుకురా అని బదులివ్వడంతో ఆర్‌ఎంపీని తీసుకెళ్లి చూసేసరికి ఆయాస పడుతుండటంతో చాపర పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి 108 ద్వారా టెక్కలి ఆస్పత్రికి తీసుకె ళ్తుండగా మర్రిపాడు–సి గ్రామ సమీపంలోనే మృతిచెందారు. అప్పన్న స్వగ్రామం ఎచ్చెర్ల, భార్య వరలక్ష్మికుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం ఎచ్చెర్లకు తరలించారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బయో మెడికల్‌ వ్యర్థా ల నిర్వహణ శాసీ్త్రయంగా జరగాలని, ఆస్పత్రు ల యాజమాన్యాలు నిబంధనలు విధిగా పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆస్పత్రుల వ్యర్థాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు కాలుష్యనియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనల ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈఈ బి.కరుణశ్రీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనిత, ఈఈఏ కళ్యాణ్‌ బాబు పాల్గొన్నారు.

ఉత్సాహంగా టెన్నీకాయిట్‌ ఎంపికలు

పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం అండర్‌–18 జిల్లా టెన్నీకాయిట్‌ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. బాలుర జట్టులో బి.సిద్దార్ధ, బి.ఉదయ్‌కిరణ్‌, కె.ప్రవీణ్‌కు మార్‌, టి.వెంకటేష్‌, స్టాండ్‌ బైగా కె.జస్వంత్‌.. బాలికల విభాగంలో పి.శ్రావణి పాత్రో, ఎన్‌.దివ్య, వై.వరలక్ష్మి, బి.నందిని ఎంపికై నట్లు రాష్ట్ర టెన్నీకాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా టెన్నీకాయిట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లా సంతోష్‌కుమార్‌, కార్యదర్శి పి.కృష్ణారావు, ఉపాధ్యాయులు చక్రపాణి ప్రధానో, ఎ.ఆనందరావు, బి.శంకరరావు, ఆర్‌.శ్రీనివాసరా వు, న్యాయనిర్ణేతలు బి.తిరుమల, ఎం.దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు   1
1/2

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు   2
2/2

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి మంజూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement