 
															తుఫాన్ సమయంలో 136 మంది జననం
కొరాపుట్: మోంథా తుఫాన్ సమయంలో 136 మంది శిశువులు జన్మించినట్లు కొరాపుట్ జిల్లా వైద్యశాఖాధికారులు ప్రకటించారు. గురువారం కొరాపుట్ జిల్లా అదనపు వైద్యాధికారి నీల మాధవ్ సత్పతి విలేకరులతో మాట్లాడారు. శిశువుల్లో 67 మంది అబ్బాయిలు, 69 మంది అమ్మాయిలు ఉన్నారన్నారు. ఒక కవల జంట జననం జరిగిందన్నారు. తుఫాన్ నేపథ్యంలో ముందుగా తాము 332 మంది గర్భిణులను అస్పత్రులు, ప్రసూతి గృహాలకు తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రసవ సమయంలో వీరందరికి సహాయం అందిందన్నారు. గర్భిణులను తరలించడానికి అన్ని మార్గాలను వినియోగించుకున్నామని వెల్లడించారు. అంబులెన్సులు వెళ్లలేని కొండ మార్గాలకు బైక్ అంబులెన్సులు ఉపయోగించామన్నారు. కొన్నిచోట్ల పడవల్లోనూ గర్భిణులను తరలించినట్లు తెలిపారు.
 
							తుఫాన్ సమయంలో 136 మంది జననం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
