 
															జైలు నుంచి 114 మంది ‘ఎస్‌ఐ అభ్యర్థులు’ విడుదల
భువనేశ్వర్: ఒడిశా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష కుంభకోణం కేసు మలుపులు తిరుగుతోంది. క్రైం శాఖ దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వారిలో అత్యధికులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయ స్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 114 మంది నిందితులను గురువారం జైలు నుంచి విడుదల చేశారు. వీరంతా ఔత్సాహిక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు కావడం విశేషం. న్యాయ స్థానం వీరికి బెయిల్ మంజూరు చేయడంతో బరంపురం జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత వారు విడుదలయ్యారు. మరో వైపు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్షల కుంభకోణంపై ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
