 
															45 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం సమితి రొండాపల్లిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎఫ్‌బీడీఓ ఆధ్వర్యంలో పాలిటెక్నికల కళాశాల ఆడిటోరియంలో గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ చంద్రరౌత్ శిబిరాన్ని ప్రారంభించారు. ఒడిశా రక్త భండార జిల్లా హాస్పిటిల్ డాక్టర్ రితిక్ పాడీ, జ్యోతి పండా, ప్రమోద్ ఖిలోలు 45 యూనిట్ల రక్తం సేకరించారు. కొరాపుట్ పోలిటెక్నికల్ కళాశాల ఫిరోజ్ కుమార్ బెహరా, ఒడిశా రక్తదాత మహాసంఘ్ కొరాపుట్ శాఖ ఉపాధ్యక్షుడు నరసింహ పాణిగ్రహి, మితున్ కుమార్ కేశరి, సంధ్య కుమారి రంధి, అబకోశ్ ప్రదాన్, రశ్మిత కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఒడిశా తరఫున రక్త దాతల శిబిరానికి అవసరమైన సహాయం అందించారు. రక్త దాతలకు ప్రశంసాపత్రాలతో సన్మానించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
