స్తంభించిన రాకపోకలు
న్యూస్‌రీల్
మోంథా తుఫాన్ ధాటికి నేలకొరిగిన
పంటలు
సహాయక చర్యల్లో అధికారులు
–8లోu
–8లోu
విరిగిన కొండచరియలు..
మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో జూన్ 3న జరిగిన చోరీలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కాసీపూర్ నుంచి మండిబిసి వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం బుధవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,93,368లు, బంగారం 4గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 68గ్రాముల 450 మిల్లీగ్రాములు, వచ్చాయని అధికారులు తెలిపారు.
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పర్లాకిమిడి:
మోంథా తుఫాన్ ధాటికి గజపతి జిల్లాలో రాయగడ బ్లాక్ ఎస్.కోరడాసింగి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండచరియలు ఉదయం విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న రూరల్ రోడ్లు డివిజన్ ఇంజినీర్లు, బి.డి.ఓ.సుశాంత్ కుమార బారిక్ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి విచ్చేసి జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగించారు.
రాయగడ: సదరు సమితి గుమ్మఘాటి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఓడ్రాఫ్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియలు, బండరాళ్లను జేసీబీలతో తొలగించారు. అనంతరం రాకపోకలు పునరుద్ధరించారు.
పర్లాకిమిడి : ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పాతపట్నం మండలం కింగ, పెద్ద కింగ గ్రామం వద్ద తుఫాన్ ధాటికి వరి పొలాలు నీటమునిగాయి. రెండు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. వరి పంట పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ రావడంతో భారీ నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ అధికారులు సందర్శించకపోవడం తగదని వాపోతున్నారు. గుసాని సమితి జాజిపూర్ గ్రామంలో వరిపంట నీటమునిగింది. పంటనష్టానికి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో తుఫాను ప్రభావంతో గుమ్మ బ్లాక్‌లో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. బుధవారం వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత ఓడ్రాఫ్ సిబ్బంది గుమ్మా రోడ్డులో చెట్లను యంత్రాలతో తొలగించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
స్తంభించిన రాకపోకలు
స్తంభించిన రాకపోకలు
స్తంభించిన రాకపోకలు
స్తంభించిన రాకపోకలు


