రూ. 80 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ముగ్గురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం రాత్రి కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. దీంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. చిత్రకొండ ఎస్‌డీపీవో ప్రదోష్ ప్రధాన్‌కు నిఘా వర్గాల నుంచి గంజాయి భారీగా అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో సోమవారం రాత్రి బలిమెల పోలీసుస్టేషన్ నుంచి ఐఐసీ దీరాజ్ పట్నాయక్ ఓ బృందాన్ని సుర్లుకొండ బ్యారేజ్ సమీపంలో ఉంచి పేట్రోలింగ్ చేపట్టారు. ఈ సమయంలో కామబెఎడ వైపు నుంచి ఓ కంటైనర్ రావడంతో దాన్ని ఆపి లోపల ఏమి ఉందని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానంతో లోపల తనిఖీ చేయగా.. లోపల సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయి బస్తాలు ఉంచిన విషయాన్ని పోలీసులు గమనించారు. 17 బస్తాల్లో ఉంచిన గంజాయితోపాటు కంటైనర్‌లో ఉన్న ముగ్గురుని అరెస్టు చేసి మంగళవారం ఉదయం చిత్రకొండ అదనపు తహసీల్దార్ ప్రశాంత్ భత్రా సమక్షంలో హాజరు పరిచారు. గంజాయిని తూకం వేయగా 770 కిలోలు ఉండగా.. దీని విలువ 80 లక్షల రూపాయలు ఉంటుందని చిత్రకొండ ఏఎస్‌డీపీవో ప్రదోష్ ప్రదన్ తెలిపారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కంటైనర్ యజమాని రాజ్ మహుధూర్, డ్రైవర్ జేమ్స్ చౌహాన్, హెల్పర్ రితిక్ గుప్త ఉన్నారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
రూ. 80 లక్షల విలువైన గంజాయి పట్టివేత
రూ. 80 లక్షల విలువైన గంజాయి పట్టివేత


