పునరావాస కేంద్రాలకు 1320 మంది తరలింపు
మా గృహాల్లో ఆశ్రయం పొందుతున్న
మోంథా తుఫాన్ ప్రభావం
రాయగడ: మోంథా తుఫాన్ ప్రభావం రాయగడ జిల్లాపై కూడా కనిపించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో తప్పా బయట తిరగవద్దని జిల్లా యంత్రాంగం ప్రచారం చేసింది. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇదిలాఉండగా తుఫాన్ కారణంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే 1320 మందిని సుక్షిత ప్రాంతాలకు తరలించింది. జిల్లాలో మూడు సురక్షిత ప్రాంతాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇందులో గుణుపూర్‌లోని విక్రంపురం, బిసంకటక్‌లోని కుట్రాగుడ, సదరు సమితి పరిధిలోని హట్‌శశిఖల్‌లో వీటిని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే వారి ఆరోగ్య, తదితర సౌకర్యాల కోసం కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏడుగురు నోడల్ అధికారులను నియమించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విషయంలో నోడల్ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సకాలంలో సమాచారాన్ని అందిస్తారు. అయితే తుఫాన్ తీవ్రత మరింత ఉద్ధృమైతే జిల్లాలోని మరో 6,570 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సన్నహాలు చేసింది. అలాగే 160 మంది గర్భిణులను ఇప్పటికే మా గృహంలో ఆశ్రయం పొందారు. వారికి వైద్య శాఖ సిబ్బంది చికిత్సను అందిస్తున్నారు. వారి ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు పరంయవేక్షిస్తున్నారు. రాయగడ జిల్లాను రెడ్ అలెర్ట్‌గా ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అలాగే ఎటువంటి ప్రమాదాలు సంభవించినా వాటిని సకాలంలో పరిష్కరించే విధంగా 36 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది. అలాగే వారితో పాటు ముగ్గురు ప్రత్యేక అధికారులు, 33 మంది జవాన్లను అందుబాటులో ఉంచారు.
గ్రామాల్లో అప్రమత్తత
మోంథా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఆయా ప్రాంతాల సంబంధిత శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి పర్యటించి ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని గుడారి బీడీవో సుచిస్మిత బెహర, తహసీల్దార్ ఎ.స్నేహలత సమితిలోని వివిధ గ్రామాల్లో ఇప్పటికే పర్యటించి ప్రజలకు తుఫాన్ గురించి వివరిస్తున్నారు. గుడారిలో తుఫాన్ ప్రభావం వల్ల కొషొర్ సబర్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు ఇంటి పై పడటంతొ ఇంటిపై కుప్పుకూలగా.. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపొవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గర్భిణులు
పునరావాస కేంద్రాలకు 1320 మంది తరలింపు
పునరావాస కేంద్రాలకు 1320 మంది తరలింపు
పునరావాస కేంద్రాలకు 1320 మంది తరలింపు


