● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా అకాల మరణంతో నువాపడా శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది నవంబర్ 11న ఈ ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ దస్తావేజులు శనివారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గిరిజన నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఘసిరామ్ మాఝీ ఆయన అనుచరులతో భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. బడుగు, గిరిజన వర్గాలతో బలమైన సంబంధాలకు పేరుగాంచిన ఘసిరామ్ మాఝీ గత 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భూమి హక్కులు, గిరిజన వర్గాల సంక్షేమం వంటి కీలకమైన స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జయ ఢొలొకియా నువాపడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మంత్రులు గణేష్ రామ్ సింగ్ ఖుంటియా, రబి నారాయణ్ నాయక్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పండా, జిల్లా అధ్యక్షుడు కమలేష్ దీక్షిత్, ఇతర పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నువాపడా ఉప ఎన్నిక హోరు
నువాపడా ఉప ఎన్నిక హోరు
నువాపడా ఉప ఎన్నిక హోరు