
సైబర్ మోసాలపై అవగాహన
పర్లాకిమిడి: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు అరికట్టడానికి ‘సైబర్ సేఫ్టీ ప్రచారం 2025’ను కళింగ స్టేడియంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని సెంచూరియన్ వర్సిటీలోని ఓపెన్ స్టేడియంలో శనివారం ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, అదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహంతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ (పర్లాకిమిడి) ప్రశాంత భూపతి, గురండి పోలీసు అధికారి ఓంనారయణ పాత్రో, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. స్టాప్, వెరిఫై, సెక్యూర్ పేరిట 16 జిల్లాలో సైబర్ రథాలు ప్రచారంలో పాల్టొంటాయని అధికారులు తెలియజేశారు. నెల రోజులపాటు ప్రజల్లో సైబర్ నేరాలు, నెట్ బ్యాంకింగ్ సేవల్లో జాగ్రత్త వహించడం, ఏ.టి.ఎంలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాడీ, సోయెట్ డీన్ డాక్టర్ ప్రపుల్ల కుమార్ పండా, తదితరులు పాల్గొన్నారు.