
రెండు బైక్‌లు ఢీ
ముగ్గురు మృతి.. ఒకరికి గాయాలు
మల్కన్‌గిరి : కోరుకొండ సమితి టెక్‌బేడ రహదారిలో శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కనన్‌గిరికి చెందిన రామ్‌కుమార్ (35), యమున సర్థార్ (28) ద్విచక్ర వాహనంపై బయలుదేరి మల్కన్‌గిరి–బలిమెల ప్రధాన రహదారిలో టెక్‌బేడ వద్దకు వచ్చేసరికి ఎదురుగా కోరుకొండ సమితిలోని ఇందిరా ఆవాస్ కాలనీకి చెందిన మోహన్ మాఝి (23), మధు జానీ బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో రామ్‌కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి కోరుకొండ పోలీసులకు సమాచారం అందించడంతో ఐఐసీ హిమాన్షు శేఖర్‌బారిక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్సులో తరలించగా యమున, మోహన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైక్‌లు ఢీ