
ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు
కొరాపుట్: నువాపడ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేడీకి చెందిన స్టార్ కాంపైయినర్ల జాబితాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ జాబితాలో నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన నలుగురు నేతలు ఉన్నారు. జిల్లాకి చెందిన రాజ్యసభ ఎంపీ, ఒడియా సినిమా హీరో మున్నా ఖాన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జిలు ఉన్నారు. ఈ నలుగురు నేతలు నువాపడ ఉప ఎన్నికలు ముగిసేంత వరకు అక్కడే మకాం వేయనున్నారు. దీంతో ఆయా నాయకులు తమ తమ అనుచరులతో నువాపడా బయల్దేరుతున్నారు.

ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు

ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు

ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు