
గౌరిగుడలో ఏనుగుల తిష్ట
పర్లాకిమిడి: ఆంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నుంచి కాశీనగర్ రేంజ్ శియ్యాళీ పంచాయతీ గౌరిగుడ గ్రామంలోకి శుక్రవారం సాయంత్రం నాలుగు అటవీ ఏనుగులు ప్రవేశించాయి. దీంతో గ్రామస్తులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం, అరటి ఇతర కాయగూరల పంటలు కాస్తున్నాయి. దీంతో శియ్యాలీ అటవీ బీట్ గౌరిగుడ చేరుకుని ప్రజల ప్రాణాలకు ఎటువంటి హాని జరుగకుండా మైక్‌ద్వారా ప్రచారం చేస్తున్నారు. టాటా పవర్ డి స్ట్రిబ్యూషన్, రైల్వే సిబ్బందితో అటవీ అధికారులు కలిసి రాత్రి వేల పెట్రోలింగ్ జరుపుతున్నారు. గౌరిగుడ చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగులు వల్ల పంటనష్టం కలిగిస్తే ప్రభుత్వం అనుకంప పథకం వర్తించనున్నట్టు ఏసీఎఫ్ షైనీశ్రీ దాస్ తెలిపారు.

గౌరిగుడలో ఏనుగుల తిష్ట