
మత్స్యకార సామగ్రి దగ్ధం
రణస్థలం: కొవ్వాడ గ్రామంలో బడె మహందాతకు చెందిన కమ్మల షెడ్ శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. తహసీల్దార్ సనపల కిరణ్‌కు మార్, బాధితుడు మహందాతకు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వాడ తీరంలోని సముద్రం ఒడ్డున తాటి, కొబ్బరి కమ్మలతో షెడ్ ఉంది. అందులో మత్స్యకారులకు చెందిన 12 పెద్ద వలలు, మర బోటు, ఇంజన్ బోటు, తాళ్లు ఉన్నాయి. ఈ షెడ్‌కు విద్యుత్ సరఫరా లేదు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామస్తులు చూసేసరికి కమ్మల షెడ్ కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్య క్తులు షెడ్ కాల్చి వేసి ఉంటారని బాధితుడు అను మానిస్తున్నాడు. సుమారు రూ.25 లక్షలు వరకు నష్టం చేకూరిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఎఫ్‌డీవో గంగాధర్, జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు.