
మార్కెట్ జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణుల సందడి
పర్లాకిమిడి: స్థానిక మార్కెట్ జంక్షన్ శ్రీ క్రిష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విగ్రహం పా ర్క్ వద్ద బీజేపీ శ్రేణులు సాయంత్రం సందడి చేశాయి. తమ నేత కోడూరు నారాయణ రావు కు బిజేపీ పార్టీ ఉపాధ్యక్షుని పదవికి నామినేట్ అవ్వడంతో హర్షాతిరేకాలతో గజపతి విగ్రహానికి పూల మాలలు వేసి బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి మోహాన్ మఝికి జేజేలు పలికా రు. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, సాధారణ కార్యదర్శి జగన్నాధ మహాపాత్రో, రోక్కం సతీష్, బల్ల ధనుంజయ తదితరులు ఉన్నారు.
300 గ్రాముల వెండి చోరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని చినబొందిలీపురం సమీపంలో బాయన్నతోటలో నివాసముంటున్న రిటైర్డ్ డైట్ లెక్చరర్ ఇంట్లో 300 గ్రాముల వెండి చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న సంపతి పురుషోత్తం తన పెద్ద బావమరిది ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. కుమార్తె, కుమారులు పుణేలో జాబ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి నివాసగృహం మేడ మీద అద్దెకుంటున్న వ్యక్తి కిందకొచ్చి చూడగా తలుపుల తాళాలు పగలగొట్టడాన్ని గమనించి పురుషోత్తంకు ఫోన్‌లో సమాచారమందించారు. ఇంటికి చేరిన పురుషోత్తం బీరువా అరలో వెండి పోవడాన్ని గమనించాడు. లోపలి లాకర్లలో బంగారు వస్తువులు, నగదు భద్రంగానే ఉన్నాయి. కాగా ఈ చోరీ గురువారం అర్ధరాత్రి 1:30 నుంచి 4:20 గంటల మధ్య జరిగినట్లు సమీప సీసీ ఫుటేజీలో దృశ్యాలు కనిపించాయని స్థానికులు అనుకుంటున్నారు. పక్కనే మరో రెండు గృహాల్లోనూ చోరీకి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. సీఐ ఈశ్వరరావు, హెచ్‌సీ శివాజీ, క్లూస్‌టీమ్ ఘటనా స్థలికి చేరి పరిసరాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యూకే స్కాలర్‌షిప్‌కు అనూష ఎంపిక
పాతపట్నం: బూరగాం గ్రామానికి చెందిన పోలాకి అనూష యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్ట ర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ హెల్త్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్‌లో చదివేందుకు వైస్ చాన్స్‌లర్ స్కాలర్‌షిప్‌కు ఎంపికై ంది. దీనిలో భాగంగా మొదటి ఏడాది 6,500 పౌండ్లు (రూ.7,67 లక్షలు), రెండో ఏడాదికి ప్లెస్‌మెంట్ పొందింది. ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో మంచి స్కోర్ సాధించింది. అనూష తండ్రి పోలాకి గణపతి రైతు, తల్లి పోలాకి వరలక్ష్మి గృహిణి. అనూష జెమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్, నాగార్జున యూనివర్సిటీలో డిప్లమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చదివింది.
అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు
పలాస: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అర్జీలు పరిష్కారానికి పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ప్రజాగ్రీవెన్స్ నిర్వహించా రు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ గ్రీవెన్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కరించామని తెలిపారు.

మార్కెట్ జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణుల సందడి