
శుభ్రమైన చేతులే.. ఆరోగ్యానికి హేతువులు
జయపురం: జయపురం సమితి కొట్‌పాడ్ సమితి నువాగాం గ్రామంలో గ్లోబల్ హ్యాండ్‌వాష్ దినం పాటించారు. అమరజ్యోతి ఫౌండేషన్, రేకెట్ డెటో ల్ స్కూల్ హైజిన్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ సహకారంతో ఒడిశా కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ కుంధధ్ర సమితి నువాగాంలో చేతులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల పరిశుభ్రత ఒక ఆరోగ్య కరమైన సమాజం ఏర్పాటుకు దోహదపడుతుందని కొరాపుట్ జిల్లా కోఆర్డినేటర్, అమర జ్యోతి ఫౌండేషన్ తాపస హొత్త వెల్లడించారు. శుభ్రమైన చేతులు మన ఆరోగ్యానికి దోహద పడతాయ ని ముఖ్యవక్తగా పాల్గొన్న ఆయన అన్నారు. ప్రస్తు తం ఒడిశాలో 4400 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పద్మశ్రీ గోవర్ధన పొనిక, పాఠశాల ప్రధాన ఉపాద్యాయురాలు, జాతీయ పురస్కారం పొందిన మహిళ జెమ పొచిక, రాకెట్ కార్పొరేషన్, కార్పొరేట్ వ్యాపార విభాగ డైరెక్టర్ రభి భటనాగర్, అమర జ్యోతి ఫెడరేషన్ అధ్యక్షుడు బిధు భూషణ పండ పాల్గొన్నారు.

శుభ్రమైన చేతులే.. ఆరోగ్యానికి హేతువులు

శుభ్రమైన చేతులే.. ఆరోగ్యానికి హేతువులు