
చెరువులో ఆక్రమణలు కూల్చివేత
పొందూరు: లోలుగు గ్రామంలో చెరువు గర్భంలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోలుగు గ్రామంలోని 111 సర్వే నంబర్‌లో 5.44 ఎకరాల్లో కూర్మగుండం చెరువు ఉంది. అందులో సుమారు 25 సెంట్లలో 17 మంది షెడ్డ నిర్మాణంతో పాటు కొంతభాగం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చెరువు గర్భం ఆక్రమణపై కొందరు గ్రామస్తులు పొందూ రు తహసీల్దార్ కార్యాలయంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆరు నెలలు క్రితం పొందూరు రెవెన్యూ అధికారులు, సర్వే అధి కారులు సర్వే నిర్వహించారు. ఇందులో 17 మంది 25 సెంట్ల స్థలం ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్ర మణలు తొలగించాలని రెండు నెలల క్రితం పొందూరు తహసీల్దార్ ఆర్.వెంకటేష్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో శుక్రవారం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సమయంలో బాధితులు మాట్లాడుతూ తాము ఈ స్థలాలను 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, వాటిని ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. సంబందిత స్థలాన్ని కొనుగోలు చేసి షెడ్డును నిర్మించుకుని పిండిమిల్లు పెట్టుకుని జీవ నం సాగిస్తున్నామని అధికారులకు పిసిని శ్యామలరావు తెలిపారు. ఇదే షెడ్డును తొలగించాలని తమకు ఇబ్బంది పెడుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, కలెక్టర్ గ్రీవెన్సులో సైతం ఫిర్యాదు చేశానని చెప్పా రు. తొలగింపుల్లో వివక్షత చూపుతున్నారంటూ బాధితులు వాదించారు. చెరువు గర్భాలలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించా రా అని నిలదీశారు. ఈ సమయంలో తీవ్ర వాగ్వా దం చోటు చేసుకుంది. తమ విధులకు అడ్డుపడితే చర్యలు తప్పవని తహశీల్దార్ వెంకటేష్, సీఐ సత్యనారాయణలు ఆక్రమణదారులను హెచ్చరించారు. ఎస్సై వి.సత్యనారాయణ, జి.బాలరాజు, సర్వేయర్ గణపతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.