
ఘనంగా నవీన్ పట్నాయక్ పుట్టినరోజు
రాయగడ: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ సుప్రీం నవీన్ పట్నాయక్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్ నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ హాస్పటల్‌లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం శాంతి ర్యాలీని నిర్వహించారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంగా ఉండాలని జగన్నాథ, మజ్జిగౌరమ్మ మందిరాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు అనసూయా మాఝి, రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, ఉదయ్ హిమిరిక తదితరులు పాల్గొన్నారు. జల్లాల్లోని గుణుపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రఘునాఽథ్ గొమాంగొ ఆధ్వర్యంలో గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పటల్‌లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

ఘనంగా నవీన్ పట్నాయక్ పుట్టినరోజు

ఘనంగా నవీన్ పట్నాయక్ పుట్టినరోజు