
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో గుడారికి చెందిన చిత్తరంజన్ పట్నాయక్ (56) అనే వ్యక్తి బుధవారం మృతి చెందాడు. తన స్కూటీపై పని మీద రాయగడ వస్తుండగా లబాగుడ వద్ద ఎదురుగా వస్తున్న ఒక పికప్ వ్యాన్‌ను అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలకు గురవ్వగా అక్కడి కొందరు అతడిని రామనగుడ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఢీకొని వెళ్లిన పికప్ వ్యాన్‌ను గాలిస్తున్నారు.
స్కూల్ బస్ అతి వేగం.. ఒకరు మృతి
కొరాపుట్: స్కూల్ బస్ అతి వేగం వల్ల ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి తురిడి పంచాయితీ కేంద్రం నుంచి బిజూ పట్నాయిక్ స్కూల్ బస్ రాయిఘర్ వైపు వెళ్తుంది. ఇదే సమయంలో తురిడికి చెందిన సోమార్ గొండో (60) తన ద్విచక్ర వాహనంతో ఇంటికి వస్తున్నాడు. బస్సు వేగంగా దూసుకు రావడంతో అతడి బైక్ ఢీ కొని అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సోమార్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. బస్సులో ముగ్గురు చిన్నారులు గాయ పడ్డారు. రాయిఘర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాయిఘర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కలిమెల సమితిలో
మావో డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కూంబింగ్‌లో గురువారం కలిమెల సమితి మధుమాల్, చిలకలమామ్మిడి అటవీ ప్రాంతంలో ఓ డంప్‌ను జవాన్లు గుర్తించి దాన్ని బయటకు తీశారు. ఆ డంప్‌లో తుపాకీ తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు, ఇతర మావో సామగ్రి ఉన్నాయి. ఈ డంప్ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ మావోయిస్టులకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డంప్‌లో 3ఐఇడి బాంబులు, 5 డిటోనేటర్లు, 4 మీటర్ల కోడెక్స్ తీగ, జనరేటర్, వెల్డింగ్ మెషీన్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జవాన్లు ఆ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోడూరు నారాయణరావు
పర్లాకిమిడి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గజపతి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావును బీజేపీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి మానస కుమార్ మహంతి గురువారం నియమించారు. మొత్తం పది జిల్లాలకు రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధులుగా నియమించారు. ఆయన నియామకంపై గజపతి జిల్లా బిజేపీ అధ్యక్షులు నబకిశోరో శోబోరో, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, రొక్కం వేణుగోపాలరావు, రోక్కం సతీష్ (కాశీనగర్) పురుటిగుడ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి