
చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్
● ప్రజల మధ్య నవీన్ పట్నాయక్ 79వ పుట్టినరోజు
భువనేశ్వర్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నేత నవీన్ పట్నాయక్ గురువారం తన 79వ పుట్టిన రోజు వేడుకలను ప్రజల మధ్య సందడిగా జరుపుకున్నారు. స్థానిక ఎస్‌ఓఎస్ గ్రామంలో ఆబాలగోపాలంతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఏకామ్ర నియోజక వర్గంలోని గంగ నగర్ బిజూ ఆదర్శ్ కాలనీలో జరిగిన ప్రజా పరస్పర స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక బీజేడీ కార్యకర్తలు, నివాసితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రజలకు తన జీవితకాల నిబద్ధతను నవీన్ పట్నాయక్ పునరుద్ఘాటించారు. ‘నా చివరి శ్వాస వరకు నేను ఒడిశా తల్లికి సేవ చేస్తాను అని ప్రకటించారు. సేవా దృక్పథం బిజూ జనతా దళ్ తత్వంగా పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో తమ బంధాన్ని బలోపేతం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించాలని కోరారు. పిల్లలు ఆయనను ఆటపాటలతో స్వాగతించారు. పిల్లలు తయారు చేసిన కేక్‌తో నవీన్ పట్నాయక్ జన్మదిన వేడుకల్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు, బహుమతులు అందజేసి వారితో సంభాషించి కొంత సమయం గడిపారు. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత నవీన్ పట్నాయక్‌కు రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి వంటి ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూరీ సాగర తీరంలో సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ భారీ ఆకర్షణీయ సైకత శిల్పం ఆవిష్కరించి అభినందించారు.

చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్

చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్

చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్

చివరి శ్వాస వరకు ఒడిశా తల్లికి సేవ చేస్తాను: నవీన్