
ఆశా వర్కర్ల ఆందోళన
పర్లాకిమిడి: అఖిల భారత ఆశా వర్కర్ల మహాసంఘం ఆదేశాల మేరకు గజపతి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం వారు గురువారం ఆందోళన చేశారు. జాతీయ స్వాస్థ్య మిషన్‌లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, ఆశా వర్కర్లకు నెలసరి జీతం రూ. 18 వేలకు పెంపు, ప్రతి హెడ్ క్వార్టర్ ఆస్పత్రిలో ఆశా వర్కర్లకు విశ్రాంత భవనం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ నిధిలో జమ, అర్హత కలిగిన ఆశా వర్కర్లకు ఏఎన్‌ఎంలుగా పదోన్నతి వంటి పలు డిమాండ్లతో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం భారతీయ మజ్దూర్‌సంఘ్ గజపతి అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, ఆశా వర్కర్ల సంఘం కార్యదర్శి సమీక్షా గోమాంగో, అధ్యక్షురాలు నమితా గోమాంగో, రాష్ట్ర ఆశా వర్కర్లు ప్రతినిధి కామిని సింగ్ తదితరులు కలిసి అదనపు కలెక్టర్‌కు ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతిని అందజేశారు.

ఆశా వర్కర్ల ఆందోళన