
మహిళా సాధికారతపై దిశా నిర్దేశం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మిషన్ శక్తి ద్వారా పలు ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని, గ్రామ వికాస్ సంస్థ గ్రామాల్లో విద్య, తాగునీరు, ఇతర కార్యక్రమాలు 1982 నుంచి చేపడుతుండడం మంచి విషయమని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం మహిళా సాధికారతపై గ్రామ వికాస్ సంస్థ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కర్మశాలను ఏడీఎం మునీంద్ర ప్రారంభించారు. కర్మశాలలో జిల్లా పరిషత్ సీడీఓ, కార్య నిర్వహణాధికారి శంకర కెర్కెటా, గ్రామ వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిబి పి.జాన్‌సన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొక్కజొన్న అమ్మకాలకు మార్కెటింగ్ లభించడం లేదని, రైతులను ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓ సంస్థలు ఆదుకోవాలని గ్రామ వికాస్ డైరక్టర్ లిబి పి.జాన్‌సన్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలు మహిళల వికాసానికి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎన్జీఓ సంస్థలు కలిసి పనిచేయాలని జిల్లా పరిషత్ సీడీఓ శంకర కెరకెటా అన్నారు. వర్క్‌షాపులో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సునారాం సింగ్ మాట్లాడుతూ, గజపతి జిల్లాలో మైక్రో, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్గదర్శకాలు వివరించారు. వర్క్‌షాపులో మిషన్‌శక్తి డైరక్టర్ టిమోన్ బోరా, సి.సి.డి. స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎ.జగన్నాథ రాజు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతపై దిశా నిర్దేశం