
ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారిక నివాస భవనంలో మర్యాదపూర్వకంగా సందర్శించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గవర్నర్‌ను సాదరంగా స్వాగతించారు. వెలుగుల పండగ పురస్కరించుకుని ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్శన సందర్భంగా ఇరువురు ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న, ప్రారంభం కానున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.
బాణసంచా పేలుడులో వాహనం దగ్ధం
భువనేశ్వర్: స్థానిక ఆచార్య విహార్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో స్కూటర్ దగ్ధమైంది. పేలుడుతో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఈ దుర్ఘటన సంభవించింది. ఈ విచారకర సంఘటనలో ఒక బాలునితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటర్ డిక్కీలో బాణసంచా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దవిడిగాం వద్ద అక్రమ
బాణసంచా గోదాము సీజ్
పర్లాకిమిడి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గుసాని సమితి కెరండి పంచాయతీ దవిడిగాం వద్ద లైసెన్సు లేకుండా అక్రమంగా గోదాముల్లో దాచి ఉంచిన మందుగుండు సామాన్లను పర్లాకిమిడి ఆదర్శ పోలీసు ష్టేషన్ అధికారి ప్రశాంత భూపతి, ఎస్‌డీపీఓ మాధవానంద్ నాయక్ గురువారం సాయంత్రం దాడులు జరిపి సీజ్ చేశారు. ఆకులమ్మ ఫైర్ వర్క్స్‌లో అక్రమ బాణసంచా సుమారు రూ. 15 లక్షల స్టాకును పట్టుకుని దుకాణం సీజ్ చేశారు. యజమాని డి.సురేష్ (పర్లాకిమిడి)పై ఎక్స్‌ప్లోజివ్ చట్టం కింద కేసు పెట్టారు.

ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్

ముఖ్యమంత్రిని కలిసిన గవర్నర్