సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ

Oct 16 2025 6:16 AM | Updated on Oct 16 2025 6:16 AM

సిక్క

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో నవంబర్‌ 11 నుంచి 20 వరకు జరగనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు తన చాంబర్‌లో సిక్కోలు పుస్తక మహోత్సవం లోగోను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహోత్సవం కన్వీనర్‌ కె.శ్రీనివాసు, సాంస్కతిక వైజ్ఞానిక కన్వీనర్లు పి.సుధాకరావు, గొంటి గిరిధర్‌, కామినాయుడు, దొంతం పార్వతీశం, కె.కూర్మారావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

నాచు పెంపకంపై అవగాహన

ఎచ్చెర్ల: బుడగట్లపాలెం సముద్రతీరంలో కఫ్పా ఫైకాస్‌ జాతి సముద్ర నాచు పెంపకంపై స్థానిక మత్స్యకార స్వయం సహాయక సంఘాల మహిళలకు బుధవారం మత్స్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి నాచు పెంపకం చేపడుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వై.సత్యనారాయణ తెలిపారు. 50 మంది మహిళలకు 10 మంది మత్స్యకారులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. నాచు కొనుగోలు చేసే బాధ్యత మత్స్యశాఖ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్‌డీవో రవి, జీఎఫ్‌ ప్రతినిధి శామ్యూల్‌, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు.

పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రజల్లో న్యాయవిజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి, చట్టాలపై అవగాహన పెంచడానికి పారా లీగల్‌ వలంటీర్లకు సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పారా లీగల్‌ వలంటీర్లకు మ జిల్లా న్యాయ సేవా సదన్‌లో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ బుధవారం ప్రారంభించారు. వివిధ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయవాదులు అన్నెపు భువనేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బైక్‌ అదుపుతప్పి

యువకుడు మృతి

బూర్జ: ఆమదాలవలస–పాలకొండ ప్రధాన రహదారిలో నీలాదేవిపురం మలుపు వద్ద ద్విచక్ర వాహనం ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గోతులో పడటంతో యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం చేరిపేటకు చెందిన కె.సంతోష్‌గా గుర్తించారు. అదే బైక్‌పై వెనుక కూర్చున్న నమ్మి కనకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరు బుధవారం సాయంత్రం పార్వతీపురంలో ఓ శుభకార్యం ఫొటోషూట్‌ తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హెచ్‌సీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.

పుస్తెలతాడు చోరీ

సంతబొమ్మాళి: బోరుభద్ర గ్రామంలో మార్పు అప్పన్నమ్మకు చెందిన రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైనట్లు సంతబొ మ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపారు. బుధవారం ఉదయం అప్పన్నమ్మ తన కన్నవారిల్లు ఉన్న నగిరిపెంట గ్రామానికి వెవెళ్లింది. తిరిగి బోరుభద్ర వచ్చేందుకు నగిరిపెంట జంక్షన్‌ వద్ద బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడు తెంచుకుని పారిపోయారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ   1
1/3

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ   2
2/3

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ   3
3/3

సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement