
ప్రభుత్వమే ఆదుకోవాలి
● జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు
పర్లాకిమిడి: దివ్యాంగులకు బస్సుల్లో, ట్రైన్‌లలో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రపంచ వైట్ క్యాన్ డేను స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్‌లో ఘనంగా నిర్వహించారు. సైట్ సేవర్స్ సంస్థ, సమర్థ్ వికలాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వైట్ క్యాన్‌డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సామాజిక భద్రతా అధికారి లక్కోజు సంతోష్ కుమార్, సమర్థ్ సంస్థ అధ్యక్షుడు నిరంజన్ బెహరా, పి.చిన్నారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మందికి అంధులకు తెల్లని స్టిక్‌లు జిల్లా పరిషత్ చైర్మన్ అందజేశారు. వైట్ క్యాన్ అంటే వికలాంగుల చిహ్నం, ఒడిశాలో వికలాంగులకు 60 శాతం, 80 శాతం అంగవైకల్యమని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అలా లేదని, దీనిని ప్రభుత్వం సరిదిద్దాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 6433 మంది దివ్యాంగులు ఉండగా.. కేవలం 3050 మందికి నెలసరి భృతి రూ.3500లు లభిస్తుందని సీసీడీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎ.జగన్నాథ రాజు అన్నారు. ముగింపు సభలో దివ్యాంగుడు, సమర్థ్ సంస్థ కార్యదర్శి సంతోష్ మహరాణా అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి