
నృత్య పోటీలకు విశేష స్పందన
పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా ముఖ్య శిక్షా కార్యాలయం, రాష్ట్ర ఉపాధ్యాయ ట్రైనింగ్, ఉన్నత విద్యామండలి (ఎస్.సి.ఈ.ఆర్.టి) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నృత్య పోటీలు బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ముఖ్యశిక్షాధికారి మాయధర్‌సాహు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నృత్య పోటీల విజేతలకు రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. అదనపు డీఈఓ గిరిధర్, డాక్టర్ ముర్ము, జిల్లా సైన్సు కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, అంతర్జాతీయ ఒడిశా నృత్య కళాకారిణి డి.ప్రియాంక, హెచ్‌ఎం పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. మనో డ్యాన్సు, ఒడిస్సీ, సంబల్‌పురి నృత్యాలు అలరించాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఆదర్శ దాస్, డి.ప్రియాంక, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ వ్యవహరించారు. విజేతలకు డీఈఓ మాయాధర్ సాహు బహుమతులు అందజేశారు.

నృత్య పోటీలకు విశేష స్పందన